నగరంలోని అసెంబ్లీ ఎదురుగా శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కింద పడి మురళీ కృష్ణ అనే ప్రభుత్వ ఉద్యోగి చనిపోయారు.
స్కూటీ మీద వెళ్తున్న మురళీ కృష్ణ.. బస్సు వెనుక చక్రం కింద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, మురళీ కృష్ణ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.