ఆస్పత్రిలో రోగి దారుణ హత్య.. కత్తులతో పొడిచిన దుండగులు

తమిళనాడులోని దారుణం చోటుచేసుకుంది. రాష్టంలోని మధురైలో దారుణం వెలుగు చూసింది. అదేమంటే..  రాజాజీ ఆస్పత్రికిలోకి ఈరోజు ఉదయం నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో లోనికి వచ్చారు. చికిత్స పొందుతున్న ఓ రోగిపై పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా పొడిచారు. ఈ దాడిలో రోగి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన రోగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే మాచారం అందుకున్న పోలీసులు రాజాజీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.ఆస్పత్రిలో హత్య జరిగే సరికి మిగతా రోగులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. అయితే ఈ ఘటనతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని భారీగా మోహరించారు.