తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. రాజధాని హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఅండ్టీ కాలనీలో అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు విషయం ఏమిటంటే.. వినయ్ అనే రౌడీషీటర్‌ను దుండగులు హత్య చేశారు. హత్యకు గురైన వినయ్ గౌలిగూడ వాసిగా పోలీసులు వెల్లడిస్తున్నారు.