జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్లో ముగ్గురు వ్యక్తులను కొందరు దారుణంగా హత్య చేశారు. తండ్రి, ఇద్దరు తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్ధులు దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.
కుల సంఘం సమావేశం జరుగుతుండగా, రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రాల నేపంతో ఈ ముగ్గురి హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.