జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న గాంధీనగర్‌లో తీపిరెడ్డి గంగారెడ్డిని ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య చేశారు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా నరేష్, శ్రీధర్ అనే యువకులు హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
జగిత్యాల పట్టణంలో వాణి నగర్ కు చెందిన తిప్పి రెడ్డి గంగా రెడ్డి (60) నరేష్ కు అప్పు ఇచ్చాడు. అయితే నరేష్ తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో గంగారెడ్డి ప్రతిరోజు డబ్బుల గురించి నరేష్‌ను అడిగాడు. దీంతో గత కొన్నిరోజలుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విసుగు చెందిన నరేష్ ఎలాగైనా సరే గంగా రెడ్డి ని హతమార్చాలని ప్లాన్ చేశాడు. పథకం ప్రకారమే నరేష్ తన స్నేహితుడు శ్రీధర్ తో కలిసి అప్పు చెల్లిస్తానని గంగారెడ్డిని తీసుకు వెళ్లి గాంధీ నగర్ లో గల కార్ మెకానిక్ షేడ్ లో గొంతు నులిమి హత్య చేశారు.
శ్రీధర్ పలు దొంగతనాల కేసుల్లో నిందితుడు. కార్ మెకానిక్ షేడ్ లో వెనుక గంగారెడ్డిని హతమార్చి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. హత్య విషయం తెలయిని కుటుంబ సభ్యులు గంగారెడ్డి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు గంగారెడ్డి హత్య వెలుగులోకి వచ్చింది. నరేష్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం బయట పడింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.