యువకులైన రెండు బ్యాచ్‌లు వేర్వేరుగా మద్యం సేవిస్తున్నారు. ఒక బ్యాచ్‌లోని ఒకడు మరో బ్యాచ్ వద్దకు వెళ్లి అగ్గిపెట్టె అడిగాడు. అక్కడ మొదలైన వివాదం, ఓ యువకుడి హత్యకు దారితీసింది. కావలిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు కావలి టూ టౌన్ పోలీసుల కథనం మేరకు.. కావలి పట్టణంలో ఉన్న కో–ఆపరేటివ్ కాలనీలోని తాళాలు వేసి ఉన్న ఓ విద్యాసంస్థల ప్రాంగణంలోకి గోడలు దూకి కొందరు యువకులు మద్యం తాగుతున్నారు.
వారిలో చంద్రశేఖర్ అనే యువకుడు అగ్గిపెట్టె కోసం మరో బ్యాచ్ వద్దకు వెళ్లాడు. వారి మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదంలో షేక్ జమీరుద్దీన్ (25) మరణించాడు. ఈ మేరకు మృతుడి తండ్రి పోలీసులకు తన కుమారుడైన షేక్ జమీరుద్దీన్‌ను బోగిరి నిఖిల్ పట్టుకోగా, కాకి రాహూల్ బీరు బాటిల్‌తో గొంతులో పొడిచి చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మృతు ని స్నేహితుడై పృధ్వీరాజ్ తీవ్రగాయాలు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. టూ టౌన్ సీఐ మల్లికార్జునరావు, ఎస్సై టి.అరుణకుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.