యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని పాలించిన ప్రతి సీఎంకు ఓ బ్రాండ్ ఉంది. తాను కూడా ఓ బ్రాండ్ క్రియేట్ చేశాననుకుంటున్నానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా అకాడమీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టుతున్నట్టు తెలిపారు. పోలీస్ స్కూల్‌ను సైనిక్ స్కూల్ స్థాయిలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ సూచించారు. ఇందుకోసం అవసరమైన నిధులు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.



