నా కొడుకులకు డ్రగ్స్‌ అలవాటు లేదు

My sons does not get used to the drugs: suresh babu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు రానాకు డ్రగ్స్‌ అలవాటు ఉందని, పోలీసుల విచారణలో రానా పేరు కూడా వచ్చిందని, అయితే సురేష్‌బాబు తనకున్న రాజకీయ పలుకుబడితో రానా పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డట్లుగా ప్రచారం జరుగుతుంది. రానాకు గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందని, పబ్‌లకు, క్లబ్‌లకు ఎక్కువ తిరిగే రానాకు డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మీడియాలో వస్తున్న వార్తలపై సురేష్‌బాబు స్పందిస్తూ తన కొడుకుకు డ్రగ్స్‌కు అలవాటు లేదు అని తేల్చి చెప్పాడు. 

సురేష్‌బాబు పెద్ద కొడుకు రానాతో పాటు చిన్న కొడుకు అభిరామ్‌ కూడా డ్రగ్స్‌ వాడుతున్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. దాంతో స్వయంగా సురేష్‌బాబు మీడియా ముందుకు వచ్చాడు. తనపై అక్కస్సుతో ఒక వర్గం మీడియా ఇలాంటి ప్రచరం చేస్తుందని, తన ఇద్దరు కొడుకులు కూడా డ్రగ్స్‌ వాడినట్లు తేలితే ఏం చేసేందుకు అయినా తాను సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక ఇండస్ట్రీలో డ్రగ్స్‌ వాడుతున్న ఆ పది మంది ఎవరు అనే విషయం కూడా తనకు తెలియదు అని, మీడియాలో వార్తలను చూసిన తర్వాతే వారి గురించి తనకు తెలిసిందని సురేష్‌బాబు అన్నారు. సురేష్‌బాబు చిన్నకొడుకు అభిరామ్‌కు ఖచ్చితంగా డ్రగ్స్‌ అలవాటు ఉందని సినీ వర్గాల్లో కొందరు బలంగా చెబుతున్నాడు. ఎప్పుడు కూడా పబ్‌ల్లో తిరిగే అతడు చెడిపోయాడు అని కొందరు అంటూ ఉంటారు.