ప్లీనరీకి తల్లి, చెల్లి పిలుపు వెనుక ?

sharmila and vijayamma campain to nandyala bypoll elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఊరక రారు మహానుభావులు అన్నది ఓ పాత నానుడి. కానీ వైసీపీ అధినేత జగన్ విషయంలో దీన్ని కొద్దిగా మార్చి చెప్పుకోవాల్సి వస్తోంది. ఊరక చేయరు మహానుభావులు అని జగన్ గురించి చెప్పుకోవాలి. అలా ఎందుకంటే కొద్ది రోజులు వెనక్కి వెళ్ళాలి. 2014 ఎన్నికల తర్వాత వైసీపీ కార్యక్రమాల్లో జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కనిపించింది నామ మాత్రం. కానీ విజయవాడ, గుంటూరు మధ్యన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగిన వైసీపీ ప్లీనరీలో విజయమ్మ, షర్మిలకు పెద్ద పీట వేశారు. వారి ప్రసంగాలు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. దీంతో తల్లి, చెల్లిని కూడా అవసరం తీరాక పక్కనబెట్టారని జగన్ ఎదుర్కొంటున్న విమర్శకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. కానీ అదే నిజమని ఇప్పుడు తేలింది.

జగన్ హఠాత్తుగా విజయమ్మ, షర్మిలకు అంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక వారిని నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో దించాలని నిర్ణయించుకోవడమేనట. భూమా కుటుంబం పట్ల వున్న సానుభూతిని కౌంటర్ చేయాలంటే విజయమ్మ, షర్మిల వల్లే సాధ్యమని ఓ నిర్ణయానికి వచ్చాకే వైసీపీ ప్లీనరీకి వారిని పిలిచారట. 2019 ఎన్నికల్లో గెలుపుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోగూడదని భావిస్తున్న జగన్ చివరకు కొన్ని దేవాలయాల్లో పూజలు, రహస్యంగా యాగాలు కూడా జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే 2019 ఎన్నికలు జగన్ కి జీవన్మరణ సమస్య అని వేరే చెప్పాలా?

మరిన్ని వార్తలు 

ఫేస్ బుక్ లో భారత్ కు పోటీ లేదు

కేసీఆర్ కు కాషాయ సవాల్

జీతాలు ఇవ్వలేకపోతున్న డెక్కన్ క్రానికల్ ?