ఉత్తర మయన్మార్‌లో కచిన్ రాష్ట్రంలోని హ్పాకాంత్ ప్రాంతంలో ఉన్న జాడే గనుల్లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 70 మంది గల్లంతవ్వగా, ఒకరు మృతి చెందారు. రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
జాడే గనులు ప్రపంచంలోనే ప్రసిద్ధింగాంచిన అతి పెద్దగనులు. అయితే లారీల నుండి ఓపెన్ పిట్ గనులకు విసిరిన శిథిలాలు గుట్టలుగా పొంగిపొర్లడంతో కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. ఈ గనుల్లోని ఖనిజాలు సేకరించడం అత్యంత ప్రమాదకరమైన శ్రమతో కూడిన పని.
నిజానికి ప్రమాదాలు తరుచుగా సంభవించడంతో హ్పాకాంత్‌లో జాడే మైనింగ్‌ని నిషేధించారు. కానీ స్థానికులకు ఉపాధి లేకపోవడం, మరోవైపు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దిగజారుతున్న వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు.