బాలిక అనుమానాస్పద మృతి

బాలిక అనుమానాస్పద మృతి

జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అను మానాస్పదంగా ఓ బాలిక మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది సీఐ కె.బాలరాజు, బాలిక బంధువుల వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన బచ్చన్‌సింగ్, పూర్ణంకౌర్‌ దంపతులకు ఐదుగురు పిల్లలు వీరిలో నలుగురు కుమార్తెలు కాగా ఒక్క కుమారుడు. వీరి పెద్దకుమార్తె ఆరో తరగతి వరకు చదువుకుంది. అనంతరం చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుంది. బచ్చన్‌సింగ్‌ కుటుంబం నాలుగు నెలల క్రితం గాజులరామారంలో ఉండేవారు. ఇటీవలే సుభాష్‌నగర్‌కు వచ్చా రు. సోమవారం రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్న బాలిక ఒక్కతే ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

బయటకు వెళ్లిన అరగంట అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యు లు ఆమె ఆచూకీ కోసం చుట్టు పక్కల వెతికారు. అయినప్పటికీ ఆమె జాడ తెలియకపోవడంతో రా త్రి ఒంటి గంటకు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కిడ్నాప్‌ అయినట్లుగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాత్రి 2:30 గంటలకు జీడిమెట్ల పోలీసులకు పైప్‌లైన్‌ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద బాలిక మృతదేహం పడి ఉందని అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ అమ్రిత్‌ పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీ సులు బాలిక తల్లిదండ్రులను ఘటనా స్థలికి పిలిపించి వాకబు చేయగా వారి కూతురేనని తెలిపారు. బాలిక చున్నీ అపార్ట్‌మెంట్‌ 5వ ఫ్లోర్‌లో లభించగా ఆమె 5వ అంతస్తు నుంచి కిందకు దూకిందెమో.. అన్నట్లుగా పోలీసులు పోలీసులు వ్య క్తం చేశారు. బాలిక తలపై లోతు గాయం అవ్వడంతో పాటు నోట్లో నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి.