చిరుకు గాలం వేస్తున్న మహానటి దర్శకుడు

nag ashwin next movie planning with chiranjeevi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నాగ్‌ అశ్విన్‌ సుదీర్ఘ విరామం తర్వాత ‘మహానటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సావిత్రి జీవిత చరిత్రను ప్రేక్షకులకు కల్లకు కట్టినట్లుగా చూపించిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి మహానటి చిత్ర యూనిట్‌ సభ్యులను తన ఇంటికి ఆహ్వానించి మరీ సన్మానించాడు. సావిత్రి జీవితాన్ని అద్బుతంగా తెరకెక్కించారంటూ దర్శకుడిని చిరంజీవి అభినందించడం జరిగింది. ఇలాంటి కథతో సినిమాను అందరిని మెప్పించే విధంగా చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ నాగ్‌ అశ్విన్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సమయంలోనే చిరంజీవి వద్ద తన కోరికను నాగ్‌ అశ్విన్‌ పెట్టాడు.

నాగ్‌ అశ్విన్‌ ఒక జానపథ చిత్రాన్ని చిరంజీవితో చేయాలనే కోరికతో ఉన్నాడట. ఆ విషయాన్ని స్వయంగా చిరంజీవి వద్ద చెప్పడం, ఆయన కథ సిద్దం చేయి, తప్పకుండా చేద్దాం అంటూ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చేసిన రెండు సినిమాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నాగ్‌ అశ్విన్‌ అప్పుడే చిరంజీవితో సినిమాకు సిద్దం అయ్యాడు. ఈయన చాలా స్పీడ్‌గా ఉన్నాడు అంటూ సినీ వర్గాల్లోగుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న సైరా చిత్రం చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతుంది. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తాడేమో చూడాలి.