ఆరోగ్య శాఖ మంత్రిని ప్రశ్నించిన దర్శకుడు నాగ్ అశ్విన్

ఆరోగ్య శాఖ మంత్రిని ప్రశ్నించిన దర్శకుడు నాగ్ అశ్విన్

నిన్న గాంధీ ఆసుపత్రి లో జూనియర్ డాక్టర్ల పై జరిగిన దాడిని నిరసిస్తూ రోడ్డు పై బైఠాయించి నిరసన తెల్పిన సంగతి విదితమే. వైద్యుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, తమకు న్యాయం కావాలని, వారి సమస్యలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిష్కరించాలని కోరారు. అయితే ఈ ఘటన వ్యవహారం అంతా సోషల్ మీడియా లో వైరల్ అయింది. అందుకు సంబంధించిన వీడియో లు సైతం ప్రతి ఒక్కరినీ కడిలించెలా చేసింది. అయితే దీని పై మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఘాటుగా స్పందించారు. మంత్రి ఈటెల రాజేందర్ ను సూటిగా ప్రశ్నించారు.

ప్రముఖ గాంధీ ఆసుపత్రి కి హైటెక్ నుండి వచ్చే అటెన్షన్ మరియు విరాళాలు అవసరం అని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి పోరు లో దాదాపు వంద రోజులు గా వైద్యులు పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.వర్షంలో జూనియర్ డాక్టర్లు ఉన్నారు అని, వారు సహాయం కోసం వేడుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పీజీ ఫీజు కూడా పెరిగింది అని అన్నారు. ఇది కరెక్ట్ కాదు అని అన్నారు. ఇంకెంత కాలం పరీక్ష అని దర్శకుడు నాగ్ అశ్విన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను ప్రశ్నించారు.