రెండు కొత్త షోలను ప్రారంభించనున్న నాగబాబు

రెండు కొత్త షోలను ప్రారంభించనున్న నాగబాబు

ట్యాలెంట్‌ ఉన్న హ్యాస్యనటులను ప్రోత్సహించేందుకు నటుడు నాగబాబు డిజిటల్‌ మీడియా వేదికగా రెండు కొత్త షోలను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి స్టాండప్‌ కామెడీ షో, మరోకటి ‘అదిరింది’ మాదిరి కామెడీ స్కిట్స్‌ అని తెలిపారు. అందులో ఇప్పటికే స్టాండప్‌ కామెడీ షో.. ఖుషీ ఖుషీగా వివరాలను జబర్దస్త్‌ నటుడు బుల్లెట్‌ భాస్కర్‌ వెల్లడించారు. తాజాగా కామెడీ స్కిట్స్‌తో కూడిన షో వివరాలను జబర్దస్త్‌ ఫేమ్‌ గెటప్‌ శ్రీను ఓ వీడియో ద్వారా వివరించారు.

షో పేరు విజిల్‌.. ప్రీలోడెడ్‌ అని తెలిపారు. ఈ డిజిటల్‌ షోలో అవకావం దక్కించుకోవడానికి ఏం చేయాలో కూడా వివరించారు. ఆ తర్వాత ఎంపిక ప్రకియ ఎలా కొనసాగుతుందో కూడా తెలిపారు. ఎంపికైనవారికి ప్రోత్సహకాలు ఉంటాయని చెప్పారు. నాగాబాబు ఆధ్వర్యంలోని జడ్జిమెంట్‌ ప్యానల్‌ చివరకు.. ఆరు టీమ్‌లను ఎంపిక చేసి వాటి మధ్య ఫైనల్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వీరికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ షోలో పాపులర్‌ కమెడియన్స్‌ కూడా పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.