‘మజిలి’ ప్రారంభం అయ్యింది, కాని…!

Naga Chaitanya And Samantha Next Film Titled Majili

అక్కినేని నాగచైతన్య మరియు సమంతల కలయికలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఆమూడు సినిమాల్లో ‘ఆటోనగర్‌’ సూర్య అంతగా ఆకట్టుకోలేక పోయినా కూడా ‘ఏమాయ చేశావే’ మరియ ‘మనం’ చిత్రాల్లో వీరి రొమాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే వీరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. వీరి ప్రేమ పెళ్లిగా మారి సంవత్సరం కాబోతున్న నేపథ్యంలో వీరిద్దరు కలయికలో ఒక చిత్రం రాబోతుంది. ‘మజిలి’ టైటిల్‌తో రూపొందబోతున్న ఈ చిత్రంకు శివ నిర్వాన దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం హాలీడే ట్రిప్‌లో భాగంగా ఈ జంట స్పెయిన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు.

nag-chaitanya

వచ్చే నెలలో చైతూ, సమంతల మొదటి పెళ్లి రోజు వేడుక జరుపుకునేందుకు స్పెయిన్‌ వెళ్లడం జకిగింది. అక్కడ నుండి వచ్చిన తర్వాత ‘మజిలి’ చిత్రీకరణలో పాల్గొంటారు. అయితే వారు రాకుండానే షూటింగ్‌ ప్రారంభం అయినట్లుగా సమాచారం అందుతుంది. దర్శకుడు శివ నిర్వాన వారిద్దరు లేకుండానే సీన్స్‌ను తెరకెక్కిస్తున్నాడు. వచ్చే నెల మూడవ వారం నుండి ‘మజిలి’ చిత్రీకరణలో ఈ బ్యూటీఫుల్‌ జంట పాల్గొనబోతున్నారు. వచ్చే వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు శివ నిర్వాన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మజిలి చిత్రం షూటింగ్‌ చైతూ, సమంత లేకుండానే ప్రారంభించడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయమై సోషల్‌ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది.

samantha