పదేళ్ల స్నేహానికి, మూడేళ్ల వివాహిక బంధానికి స్వస్థి చెప్పారు సమంత-నాగ చైతన్య. 2017 ప్రేమ వివాహం చేసుకున్న ఈ స్టార్ కపుల్ మూడేళ్ల పాటు అన్యోన్యంగా జీవించిన ఈ జంట తాము విడిపోతున్నామంటు విడాకుల ప్రకటన చేసి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో చై-సామ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు సైతం షాక్ అయ్యారు. అయితే వారి మధ్య ఎలాంటి కలతలు వచ్చాయో తెలియదు కానీ.. వీరు విడిపోయారన్న విషయాన్ని మాత్రం అక్కినేని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే కొంతకాలంగా ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయని అప్పటి నుంచి చై-సామ్ విడిగా ఉంటున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న చై ఓ ఫ్లాట్ తీసుకుని లవ్‌స్టోరీ మూవీ షూటింగ్‌కు అక్కడి నుంచే పాల్గోన్నట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే విడాకుల ప్రకటనకు ముందు చై-సామ్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివసించేవారని, అది సమంతది అని సమాచారం. ఈ నేపథ్యంలో వారిద్దరు కలిసి ఉండేందుకు చై గతేడాది జూబ్లిహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేశాడట.ప్రస్తుతం దాని రెనోవేషన్ పనులు జరగుతున్నాయట. ఇది పూర్తవడానికి ఇంకా ఎడాది సమయంలో పడుతుందట.
దీంతో చై జూబ్లిహిల్స్‌లోని ఓ అపార్టుమెంటులో కొత్తగా ఫ్లాట్ కొన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే విడాకుల ప్రకటన అనంతరం చై-సామ్ విడిపోయి వేరువేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత గచ్చిబౌలిలో అదే ప్లాట్‌లో ఉంటుండగా.. చైతన్య ఈ అపార్టుమెంటుకు మాకాం మార్చి అక్కడే ఒంటరిగా ఉంటున్నాడట. కనీసం కుటుంబాన్ని కలవడానికి ఇష్టపడటం లేదట. అందుకే బయటకు కూడా రాకుండా అపార్టుమెంటులో ఒంటరిగా ఉంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈ క్రమంలో ఆ ఫ్లాట్‌ను చై కోనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది స్పష్టత రావాల్సి ఉంది.