బీర్లు తాగుతున్న’చైతు’ హీరోయిన్… ఎందుకో తెలుసా ?

Naga Chaitanya Heroine Manjima Mohan takes Beer For Zam Zam Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్ లో దుమ్ములేపిన సినిమా క్వీన్. ఈ సినిమాలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా కంగనా రనౌత్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కుడా బాగా పెరిగింది. ఇప్పుడు అదే సినిమాను సౌత్ లో ఉన్న నాలుగు భాషల్లోనూ ఒకేసారి రీమేక్ అవుతుంది. ఒకో భాషలో ఒకో హీరోయిన్ లీడ్ రోల్ లో నటించనుంది. తెలుగు వెర్షన్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే మళయాళ వెర్షన్ లో సాహసం శ్వాసగా సాగిపో ఫేం మంజిమా మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు వెర్షన్లనూ డైరెక్ట్ చేస్తోంది మన తెలుగు దర్శకుడు నీలకంఠయే.మళయాళంలో క్వీన్ రీమేక్ ను జామ్ జామ్ పేరుతో తెరకెక్కిస్తున్నారు.

Queen-movie-remake-heroine

ఒరిజినల్ సినిమాను అదే విధంగా రుపొందించకుండా మన నేటివిటికి అనుగుణంగా ఈ సినిమాను దర్శకుడు నీలకంఠ తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు.. ఈ సినిమాపై మంజిమా మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నేను బీరు తాగే సీన్ ఒకటి ఉంది. ఫస్ట్ బీర్ తాగేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, తర్వాత ఈ పాత్రను ఛాలెంజ్ గా తీసుకొని నటించడం వలన ఆ సీన్ బాగా వచ్చింది. ఈ బీర్ సీన్ కూడా షూటింగులో చాలా బాగా వచ్చింది. ఈ పాత్రలో నటించడం నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది ఏదో సాదాసీదా పాత్ర కాదు కదా!, ఛాలెంజ్ తో కూడుకున్న రోల్. మొదట్లో ఈ సినిమా నా దగ్గరకు వచ్చినపుడు ఈ క్యారెక్టర్ లో నేను సరిగ్గా చేయగలనా లేదా అనే డౌట్ వచ్చింది. ఒక్కోసారి చాలాసార్లు టేకులు కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ పాత్రను చేస్తున్న కొద్దీ, ఈ పాత్రను ఎంజాయ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది’’అంటోంది మంజిమ.