టాలీవుడ్ మాజీ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంది. సామ్, చై గురించి ఏ వార్త విన్న ప్రతిసారి విడాకులకు కారణం ఏంటనే ప్రశ్నను ప్రతీ ఒక్కరూ తమకు తాము వేసుకోకమానరు. ఈ విషయం గురించి బయటకు ఎవరూ మాట్లాడకపోయిన అనేక మంది మదిలో తొలిచే పెద్ద ప్రశ్న ఇది. చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది అక్టోబర్ 2న ప్రకటించినా.. కారణం మాత్రం చెప్పలేదు. అందుకే ఆ కారణం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అసలు వీరిద్దరూ విడిపోవడం అభిమానులకే కాదు అనేక ప్రేక్షక జనానికి ఇష్టం లేదు. వారు మళ్లీ కలవాలని కోరుకునే వారు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య వారి విడాకుల గురించి ఆసక్తిర విషయాలు చెప్పాడు. ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. జనవరి 14న సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ క్రమంలోనే నాగ చైతన్యను విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది. దానికి నాగ చైతన్య ‘ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం. ఆమె సంతోషంగా ఉంది, నేను సంతోషంగా ఉన్నాను. ఈ పరిస్థితిలో ఇది ఇద్దరికీ బెస్ట్ డెసిషన్’ అని తెలిపాడు. నాగ చైతన్య మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అ వుతోంది.