అక్కినేని హీరో నాగ చైతన్య చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చై ‘థ్యాంక్యూ, బంగార్రాజు’ చిత్రాలతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. లవ్‌స్టోరీ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న చైతన్య వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తూ ఫుల్ బిజీ మారాడు. ఈ క్రమంలో చైతన్య నటిస్తున్న థ్యాంక్యూ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఈ మూవీపై రకరకాల పుకార్లు వస్తున్నాయి.
థ్యాంక్యూ మూవీని ఓటీటీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థతో మంచి ఫ్యాన్సీ రేటుకు డీల్ కుదరిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై థ్యాంక్యూ మూవీ టీం స్పందించింది. సమయం వచ్చినప్పుడు చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, మూవీ థియేటర్లో మంచి వినోదం పంచుతుందంటూ పుకార్లకు చెక్ పెట్టారు మేకర్స్.
ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తుండగా.. అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా నాగ చైతన్య ఓటీటీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో చై క్రూరమైన విలన్ పాత్రను చేస్తున్నాడట. ఒకరకంగా ఇది సైకోను పోలి ఉంటుందని సమాచారం.