అమ్మమ్మగారింట్లో సమంత ఉందా? లేదా?

naga shourya ammamma gari illu first look release today
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాగశౌర్య 15వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను నేడు మహాశివరాత్రి సందర్బంగా విడుదల చేశారు. ‘ఓయ్‌’ చిత్రంతో పలకరించి వెళ్లి పోయిన షామిలి మళ్లీ ఈ చిత్రంతో రీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఈ చిత్రంలో సమంత ఒక గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతుందని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. సినిమా చాలా ఆలస్యం అయ్యింది. గత సంవత్సరం సమ్మర్‌లోనే సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని ఇబ్బందులు మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమాను వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం సినిమా చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు.

వచ్చే వేసవి కానుకగా ఈచిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. అయితే ఈ చిత్రంలో సమంత ఉందా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అప్పుడు నటించేందుకు ఓకే చెప్పిన సమంత మళ్లీ ఇప్పుడు గెస్ట్‌గా కనిపించేందుకు ఒప్పుకుంటుందా, లేదా ఆ పాత్రకు మరెవ్వరినైనా తీసుకున్నారా అనే అంశాలు ప్రస్తుతం సినీ వర్గాల మైండ్‌ను తొలుస్తున్నాయి. ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రంలో సమంత ఉంటే ఆ సినిమా స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం. ఛలో చిత్రంతో సత్తా చాటిన నాగశౌర్య ఈ చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సమంత ఉండాలంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత అమ్మమ్మగారిల్లు సినిమాపై క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. 

 

Naga Shaurya teams up with Shamili for Ammammagari Illu