యువతరం నటులలో తనని తాను ప్రూవ్ చేసుకోడానికి కష్టపడుతున్న వ్యక్తి నాగ శౌర్య. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ డైలాగ్ తో ప్రారంభం కానుంది. సినిమా మొదలవగానే, పవన్ కళ్యాణ్ వాయిస్ తో మొదలవుతుందని ఈ చిత్ర హీరో నాగ శౌర్య అన్నారు. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రంలో కృష్ణుడు పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మైమరిపించారు. అందులో అశ్వద్ధామ గురించి చెప్పే డైలాగ్ నాకు స్ఫూర్తినిచ్చింది అని నాగ శౌర్య అన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ అశ్వథామ డైలాగు తో స్టార్ట్ చేసాం అని, దీనికి గోపాల గోపాల చిత్ర నిర్మాత శరత్ మరార్ అనుమతి కూడా తీసుకున్నామని అన్నారు.
పవన్ కనిపించరు, ఈ డైలాగ్ అశ్వథామ హీరో నిర్వచనం గా మారుతుందని, అందుకే పెట్టాం అని తెలిపారు. అయితే ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు నాగ శౌర్య.హీరోకి సంబంధించినటువంటి ప్రతి సన్నివేశాన్ని చాల జెన్యూన్ గా రాశామని చెప్పుకొచ్చారు. అన్నీ నిజ జీవితంలో జరిగినవేనని, నేను విన్నది, బాధితులు చెప్పింది మాత్రమే సినిమాలో పెట్టమని నాగ శౌర్య అన్నారు. ఈ కథ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటుగా, పంజాబ్, ఢిల్లీ లాంటి ఎన్నో ఏరియాలని తిరిగానని నాగ శౌర్య అన్నారు. అయితే విలన్ పాత్ర గురించి చెబుతూ, మేం రాసుకున్న విలన్ పాత్ర కంటే బయట నీచమైన, క్రూరమైన మనుషులు ఉన్నారనిపించింది అని అన్నారు. మేం రాసిన విలన్ పాత్ర చాల తక్కువ అనిపించింది అని అన్నారు.