పెళ్లి లేదు, అంతా అబద్దం..

naga shourya responded on about marriage rumors with niharika
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యువ హీరో నాగశౌర్య, మెగా హీరోయిన్‌ నిహారిక కలిసి ‘ఒక మనసు’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కూడా నాగశౌర్య, నిహారికలు ప్రేమలో ఉన్నట్లుగా మీడియాలో తెగ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరికి మంచిగా జత కలిసిందని, ఇద్దరు వివాహం చేసుకుంటే బాగుంటుందని మెగా ఫ్యాన్స్‌ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రేమ విషయం తర్వాత గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో నాగశౌర్య మరియు నిహారికల వివాహం గురించిన ప్రచారం జరుగుతుంది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో త్వరలోనే వీరిద్దరు ఏకం కాబోతున్నారు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య మీడియా ముందుకు వచ్చి ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఛలో’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో నాగశౌర్య మీడియాతో మాట్లాడటం జరిగింది. అదే సమయంలో నిహారికతో ప్రేమ మరియు పెళ్లి విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. తాను ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో నటించిన సమయంలో రాశిఖన్నాతో నేను ప్రేమలో ఉన్నట్లుగా రాశారు, ఆ తర్వాత సొనారిక, మాళవిక ఇలా అందరితో కూడా ప్రేమ వ్యవహారం అంటూ వార్తలు రాస్తున్నారు. ఇలాంటి వార్తలను పట్టించుకోవడం మానేశాను. అయితే తాజాగా నిహారికతో ప్రేమ, పెళ్లి అంటూ కొందరు చేస్తున్న ప్రచారం చిరాకుగా అనిపించింది. అందుకే ఇద్దరి మద్య ఏం లేదని, పెళ్లి ప్రస్థావన అస్సలు లేదు అంటూ చెప్పాలని భావిస్తున్నాను అంటూ నాగశౌర్య చెప్పుకొచ్చాడు. ఈయన ప్రకటన తర్వాత అయినా పెళ్లి వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడేనా చూడాలి.