మహేష్‌25.. కన్ఫర్మ్‌ చేసింది

pooja hegde romance with mahesh babu in Vamsi Paidipally movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కెరీర్‌లో మైలురాయి చిత్రం త్వరలో సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు పెరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మహేష్‌బాబు 25వ చిత్రంపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉండే అవకావం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా దర్శకుడు వంశీ పైడిపల్లి ప్లాన్‌ చేస్తున్నాడు. ఒక విభిన్న నేపథ్యంలో కథను సిద్దం చేశాడని, స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి ప్రస్తుతం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌బాబు ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ చిత్రాన్ని షురూ చేయాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు అనే విషయంపై గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

తాజాగా మహేష్‌బాబు 25వ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ‘డీజే’ బ్యూటీ పూజా హెగ్డే ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది. మహేష్‌బాబు 25వ చిత్రంలో తాను హీరోయిన్‌గా నటించబోతున్నాను అని, ఈ అవకాశం ఇచ్చినందుకు వంశీ పైడిపల్లికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌కు వంశీ పైడ్లిపల్లి కూడా రీ ట్వీట్‌ చేయడం జరిగింది భారీ అంచనాలున్న మహేష్‌25 చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేయడంతో ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అశ్వినీదత్‌ మరియు దిల్‌రాజులు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్నాడు. మహేష్‌బాబు 25వ చిత్రం అవ్వడంతో అన్ని కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ఫ్యాన్స్‌ను నిరాశ పర్చకుండా సినిమాను తీస్తాను అంటూ దర్శకుడు వంశీ హామీ ఇస్తున్నాడు.

mahesh 25 movie heroine