బ‌డ్జెట్ హైలెట్స్ 1

Union Budget 2018 Highlights
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
  • పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం

  • బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల్సిందిగా ఆర్థిక‌మంత్రిని కోరిన స్పీక‌ర్

  • 11గంట‌లకు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభించిన అరుణ్ జైట్లీ

  • గ‌త కొన్నేళ్లుగా తెస్తున్న సంస్క‌ర‌ణ‌లు ఇప్పుడు ఫ‌లితాల‌నిస్తున్నాయి

  • బ్యాంకుల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ కొత్త సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లికింది

  • కొత్త సంస్క‌ర‌ణ‌ల‌తో అవినీతి త‌గ్గించే అవ‌కాశం ల‌భించింది

  • డిజిట‌లైజేష‌న్ తో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పార‌ద‌ర్శ‌క‌త ఏర్ప‌డింది

  • భార‌త్ అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిల‌బ‌డింది

  • ప్ర‌పంచంలో ఏడో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌న‌ది

  • త్వ‌ర‌లోనే ప్ర‌పంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ కానుంది

  • గ‌డ‌చిన మూడేళ్ల‌లో 7.5శాతం వృద్ధిరేటును సాధించాం

  • వ‌చ్చే ఏడాది వృద్ధిరేటు 7.4శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా

  • వ్య‌వ‌సాయం, గ్రామీణాభివృద్ధి, విద్య‌, వైద్యం, ఆరోగ్యం, పోష‌కాహారంపై ప్ర‌ధానంగా దృష్టి

  • పేద‌రికం తొల‌గించేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది

  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం

  • గ్రామాల్లో ఈనామ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టి విజ‌యాలు సాధిస్తున్నాం

  • 42 మెగా ఫుడ్ మార్కెట్ల ఏర్పాటు

  • పాడిరైతుల‌కు కిసాన్ క్రెడిట్ కార్డులు

  • రైతుల కోసం జిల్లాల్లో క్ల‌స్ట‌ర్ల ఏర్పాటు

  • దేశంలో 86 శాతం చిన్న స‌న్న‌కారు రైతులే

  • అంద‌రికీ క‌నీస మ‌ద్ద‌తుధ‌ర అందించాల‌న్న‌దే మా ల‌క్ష్యం

  • గ్రామీణ వ్య‌వ‌సాయ అభివృద్ధికి రూ. 2000 కోట్లు

  • ప్ర‌ధాన‌మంత్రి గ్రామ స‌డ‌క్ యోజ‌న‌తో మ‌రిన్ని గ్రామీణ రోడ్ల అనుసంధానం

  • 2022 నాటికి అన్ని గ్రామాల‌కు ప‌క్కా ర‌హ‌దారుల నిర్మాణం

  • నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిజిట‌ల్ లావాదేవీలు పెరిగాయి

  • నోట్ల ర‌ద్దుతో ప‌న్నుల వ‌సూళ్లు పెరిగాయి

  • జీఎస్టీ వ‌ల్ల పేద‌ల‌కు మేలు జ‌రిగింది

  • విదేశీ మార‌క నిల్వ‌లు పెరిగాయి

  • త‌యారీ రంగం తిరిగి ప‌ట్టాలెక్కింది

  • త‌యారీ రంగం 8శాతం వృద్ధి దిశ‌గా అడుగులు వేస్తోంది

  • న‌వ‌భార‌త నిర్మాణంలో యువ‌త‌ను భాగ‌స్వాముల‌ను చేస్తున్నాం

  • యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు పెరిగేలా చ‌ర్య‌లు చేప‌ట్టాం

  • పేద‌ల‌కు వైద్య‌భారం త‌గ్గింది

  • ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌తో స్టంట్ల ధ‌ర‌లు త‌గ్గాయి

  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భార‌త్ కు 42వ స్థానం ద‌క్కింది

  • ఈ దిశ‌గా కృషిచేసిన ప్ర‌తిఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు