బీజేపీ మనసెందుకు మారింది…

Jaitley promises to resolve Andhra Pradesh problems

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
2014 ఎన్నికల్లో ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ తుంగలో తొక్కింది. గడిచిన వారం రోజుల్లో పార్లమెంట్ వేదికగా బీజేపీ తీరు, జైట్లీ ప్రకటనలు చూస్తుంటే ఇక కేంద్రం ఏమీ చేయదనే ఆంధ్రులంతా నమ్మారు. అయితే అనూహ్యంగా కేంద్రం ఏపీ డిమాండ్స్ కి ఒప్పుకున్నట్టు , వెంకయ్య నాయుడు , సుజనా చౌదరి ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు బయటకు వచ్చిన వార్త. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అద్వానీ, nda కి అండగా నిలిచిన చంద్రబాబు మాటకే మోడీ, షా ద్వయం విలువ ఇవ్వడం లేదని ఎవరికైనా తేలిగ్గా అర్ధం అవుతుంది. అలాంటిది వెంకయ్య, సుజనా చెపితే ఆ ఇద్దరూ వింటారు అనుకోవడం, మనసు మార్చుకుంటారు అనుకోవడం భ్రమ. అయితే పార్లమెంట్ లో ప్రకటన చేయడానికి ససేమిరా అన్న జైట్లీ ఆపై ఎలా మనసు మార్చుకున్నారు?. అమిత్ షా ఆయనకు ఏమి ఆదేశాలు ఇచ్చారు ? ఇప్పుడు ఇదే సగటు ఆంధ్రుడు మనసులో మెదులుతున్న ప్రశ్న.

కేంద్రం తాజా నిర్ణయాలకు బీజేపీ రాజకీయమే అసలు కారణం అని సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు జరగబోతున్న కర్ణాటక ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అక్కడ సర్కార్ ని ఏర్పాటు చేయగలిగితే ఇప్పుడు కనిపిస్తున్న ప్రతికూల పవనాలు తేలిగ్గా అధిగమించవచ్చు అని మోడీ, షా అభిప్రాయం. కర్ణాటక ఎన్నికల్లో గెలుపు మీద నమ్మకం లేకపోయినా గట్టి పోటీ ఇస్తామని మోడీ, షా భావించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రభావంతో గడిచిన వారం, పది రోజుల్లో పరిస్థితులు మారిపోతున్నట్టు కేంద్రానికి ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదిక అట. ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయం కోసం కర్ణాటక వెళ్లి సెటిల్ అయ్యిన వాళ్ళు పెద్ద సంఖ్యలో వున్నారు. వీళ్లలో మెజారిటీ ఆంధ్ర రాజకీయాల ప్రభావంతో ఆది నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ వ్యతిరేక వైఖరితో ముందుకు వెళుతున్నారు. కానీ పార్లమెంట్ లో బీజేపీ వైఖరి చూసాక వీరిలో అనూహ్య మార్పు వచ్చింది. ఇక సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలు కర్ణాటక లో ని తమ వారికి బీజేపీ మీద పగ తీర్చుకోమని చేస్తున్న విజ్ఞప్తి కి మంచి ప్రతిస్పందన కనిపిస్తోంది. కర్ణాటక రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ యేతర పక్షాలు చంద్రబాబు గొడుగు కింద పని చేయడానికి చూపుతున్న ఉత్సాహం కూడా అమిత్ షా, మోడీ కి ప్రమాద ఘంటికలు మోగించింది. ఈ పరిస్థితుల్లో మొండిగా ముందుకెళ్లి సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఆలోచన వచ్చాకే ఏపీ డిమాండ్స్ మీద సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎంతైనా రాజకీయ బేహారులు కదా… లెక్కలు బాగానే వేసుకున్నారు.