జబర్దస్త్ షో మీద సంచలన వ్యాఖ్యలు చేసిన నగాబాబు !

Nagababu Comments On Jabardasth

ఈ మధ్యకాలంలో నాగబాబు కాంట్రవర్సీలతో కాపురం చేస్తున్నాడు. ఒకప్పుడు వివాదాలకు దూరంగా ఉన్న మెగా బ్రదర్ ఇప్పుడు మాత్రం ప్రతి విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. చివరికి ఇప్పుడు తాను న్యాయనిర్ణేతగా ఉన్న జబర్దస్త్ షో మీద కూడా మనసు విప్పి మాట్లాడారు మెగా బ్రదర్. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ బాగా గాడి తప్పిందని ఇందులో బూతు కామెడీ ఎక్కువగా వస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఇవి అటూ ఇటూ వెళ్లి చివరికి నాగబాబు చెవిన పడ్డాయి. దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు మెగా బ్రదర్. అందరూ అనుకుంటున్నట్లు జబర్దస్త్ బూతు షో కాదని ఇందులో చాలా క్లీన్ కామెడీ వస్తుందని అంటున్నాడు. కొన్ని కోట్లమంది మనసారా నవ్వుకుంటున్నారని ఇలాంటి షోపై అభాండాలు వేయడం మంచిది కాదని అంటున్నాడు.

ఒకప్పుడు నిజంగానే కాస్త అడల్ట్ కామెడీ వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో అది పూర్తిగా తగ్గిపోయింది అంటున్నాడు మెగా బ్రదర్. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో ఒక్క చమ్మక్ చంద్ర మాత్రమే కాస్త అడల్ట్ కంటెంట్ తీసుకొని కామెడీ చేస్తాడు కానీ మిగిలిన వాళ్ళంతా చాలా క్లీన్ కామెడీ చేస్తున్నారని సర్టిఫికెట్ ఇచ్చాడు నాగబాబు. బయట వస్తున్న బూతు కామెడీ షోలు సినిమాలతో పోలిస్తే జబర్దస్త్ చాలా ఉత్తమంగా ఉందని అంటున్నాడు. ఈ షో పై లేనిపోని కామెంట్లు చేసి రేటింగ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కానీ అది ఎప్పటికీ జరగదని అంటున్నాడు నాగబాబు.