ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకి తీవ్ర అస్వస్థత !

Tollywood Veteran Director Kodi Ramakrishna Hospitalized

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం అందుతోంది. ఈరోజ ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారట. కోడి రామకృష్ణ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యరని మీడియాలో వార్తలు రావడంతో పలువురు టాలీవుడ్ ప్రమిఖులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. గతంలో పెరాలసిస్‌తో కొంత కాలం బాధ పడిన కోడి రామకృష్ణ ఆ తర్వాత కోలుకున్నారు.

అయితే ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. విలక్షణ దర్శకుడైన కోడి రామకృష్ణ.. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తెలుగుతో పాటు పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేశారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చివరి సినిమా.