21కి 21 మొత్తం గెలవబోతున్నాం అని అంటూ… నాగబాబు సంచలన ప్రకటన చేశారు . జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలియచేసారు . పార్టీ నేతలతో వర్చువల్ సమావేశంలో కూడా ఆయన మాట్లాడారు.
‘పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు అనుభవం, బిజెపి మద్దతు కూడా ఫలించాయి. జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్నది . ప్రజలకి సుపరిపాలన అందించే విధంగా మన అందరి ఆలోచన ఉండాలి. పవన్ పూనుకోకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ భూబకాసురుల దోపిడీకి బలైపోయే పరిస్థితి వస్తది అని అన్నారు.