వైసీపీ నేతలపై నాగబాబు సైటర్లు

వైసీపీ నేతలపై నాగబాబు సైటర్లు
వైసీపీ నేతలపై నాగబాబు సైటర్లు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభకు హాజరైన మెగా బ్రదర్‌, జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. సినిమాలో కమిడియన్స్‌లా.. ఇక్కడ వైసీపీ వాళ్లు కామెడీ చేస్తున్నారని అన్నారు. ఇటీవలె కళ్ళు మూసుకుంటే 9 నెలల కాలం వెళ్లిపోయిందని, మరికొన్ని రోజులు కళ్లు ముసుకుంటే మిగిలిన టైమ్‌ అయిపోతుందని వైసీపీ నేత అంటున్నారని, మీరు అలాగే ఇంకో 20, 30 ఏళ్ల నిద్రపోతూ అప్పుడప్పుడు కలవరిస్తూ ఉండండి, మిమ్మల్ని ఎవరూ డిస్టబ్‌ చేయరంటూ సెటైర్లు పేల్చారు నాగబాబు.