‘‘నా కల నెరవేరినట్లుగా అనిపిస్తోంది. ఇది నిజమేనా? అన్నంత ఉద్వేగంగా ఉంది’’ అన్నారు ఆకాంక్షా సింగ్. ఈ బ్యూటీ ఇంతగా ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ‘మే డే’ సినిమాలో అవకాశం దక్కడమే. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ దేవగణే దర్శకుడు. ఇందులో అజయ్ భార్య పాత్రలో నటిస్తున్నారు ఆకాంక్ష.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘అమితాబ్ సార్, అజయ్ సార్ కాంబినేషన్ సినిమాలో నేను నటించడం ఆనందంగా ఉంది. పైగా ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన ముహూర్తపు సన్నివేశంలో నేను ఉండటం చాలా లక్కీ. నాది చాలా కీలక పాత్ర’’ అన్నారు. ‘మళ్ళీ రావా’ సినిమాతో తెలుగుకి పరిచయమైన ఆకాంక్షా సింగ్ ఆ తర్వాత నాగార్జున సరసన ‘దేవదాస్’లో నటించారు.