నాని తర్వాత కళ్యాణ్‌ రామ్‌తో..!

Nagarjuna another multi starrer with Kalyan Ram

సీనియర్‌ హీరోల సినిమాలను ప్రేక్షకులు పెద్దగా చూడటం లేదు. ముఖ్యంగా నాగార్జున, వెంకటేష్‌ల మూవీలకు పెద్దగా డిమాండ్‌ లేదు. అందుకే వీరిద్దరు కూడా మెయిన్‌ హీరోలుగా నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం వీరిద్దరు కూడా మల్టీస్టారర్‌ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వెంకటేష్‌ ప్రస్తుతం ఇద్దరు యువ హీరోలతో విడి విడిగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా నాగార్జున కూడా వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలకు ఆసక్తి చూపుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న నాని, నాగ్‌ మల్టీస్టారర్‌ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరో మల్టీస్టారర్‌ చిత్రాన్ని కూడా నాగార్జున కమిట్‌ అయినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

నానితో శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్న నాగార్జున త్వరలోనే కళ్యాణ్‌ రామ్‌తో మరో మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయబోతున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ కోసం పవన్‌ సాదినేని ఒక మల్టీస్టారర్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. ఆ స్క్రిప్ట్‌ పరంగా నాగార్జున ఒక ముఖ్య పాత్ర పోషిస్తేబాగుంటుందని అనిపించిందట. అందుకే నాగార్జునను కళ్యాణ్‌ రామ్‌ సంప్రదించడం, అందుకు వెంటనే నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగి పోయింది. కథ కొత్తగా ఉండటంతో పాటు, విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో పవన్‌ సాదినేని సినిమాను తెరకెక్కిస్తాడనే నమ్మకం ఉండటం వల్లే నాగార్జున ఈ మల్టీస్టారర్‌కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని కళ్యాణ్‌ రామ్‌ సొంతంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో అతి పెద్ద సినిమాగా ఇది నిువబోతుందనే టాక్‌ వినిపిస్తుంది.