జైనబ్‌పై నాగార్జున గ్రీన్ సిగ్నల్…….అఖిల్‌కు సరైన తోడు?

Nagarjuna gives green signal to Zainab....is she the right partner for Akhil?
Nagarjuna gives green signal to Zainab....is she the right partner for Akhil?

అక్కినేని వారి ఇంట వరుస వివాహ వేడుకలు జరగనున్నాయి. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం శోభితతో డిసెంబర్ 4న జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి పనులు శరవేగంగా జరగనున్నాయి.

మరోవైపు నాగార్జున రెండో కొడుకు అఖిల్ కూడా పెళ్లికు సిద్ధమైన సంగతి తెలిసిందే. జైనబ్ రవ్జీని అఖిల్ పెళ్లాడబోతున్నాడు. ఈ నేపథ్యంలో నాగార్జున మాట్లాడుతూ… తమ కుటుంబంలో వరుస పెళ్లి వేడుకలు జరగనుండటం సంతోషంగా ఉందని అన్నారు. తమ కుటుంబం పెద్దదని, శోభిత వాళ్ల కుటుంబం కూడా పెద్దదేనని చెప్పారు. కుటుంబ సభ్యులు, తక్కువ మంది అతిథుల సమక్షంలో గ్రాండ్ గా వివాహ వేడుకని నిర్వహించాలనుకుంటున్నామని తెలియచేసారు .

Nagarjuna gives green signal to Zainab....is she the right partner for Akhil?
Nagarjuna gives green signal to Zainab….is she the right partner for Akhil?

అఖిల్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని నాగార్జున చెప్పారు. జైనబ్ చాలా మంచి అమ్మాయని అన్నారు. అఖిల్ జీవితాన్ని ఆమె పరిపూర్ణం చేయగలదని చెప్పారు. తమ కుటుంబంలోకి జైనబ్ ని సంతోషంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది అఖిల్-జైనబ్ వివాహం జరుగుతుందని ఆయన వెల్లడించారు.