నాగ్‌ రికమండేషన్‌ వల్లే బిగ్‌బాస్‌కు..!

Nagarjuna Recommendation To Nani In Bigg Boss Hoster

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు హోస్ట్‌గా నాని వ్యవహరించబోతున్నాడు. గత మూడు నాలుగు నెలలుగా ఈ విషయంను నాన్చిన స్టార్‌ మాటీవీ ఎట్టకేలకు నానిని హోస్ట్‌గా ఎంపిక చేసినట్లుగా ఒక ప్రోమోను సైతం విడుదల చేసింది. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌కు నాని ఎంపిక చేయడంతో ప్రేక్షకులు కాస్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్‌ స్థాయిలో ఈ సీజన్‌ ఆకట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే స్టార్‌ మా వారు మాత్రం గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో ఇంకాస్త మసాలా దట్టించబోతున్నట్లుగా ప్రోమోలో చెప్పేశారు. దాంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ షోకు నాని హోస్ట్‌గా రికమండ్‌ చేసింది నాగార్జున అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నాగార్జునకు గతంలో మాటీవీలో మెజార్టీ వాటా ఉండేది. కాని మా టీవీని స్టార్‌ వారు కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతం గౌరవ షేర్‌ హోల్డర్‌గా మాత్రమే నాగార్జున కొనసాగుతూ వస్తున్నాడు. అదే సమయంలో స్టార్‌ మాటీవీలో కొన్ని కార్యక్రమాలకు సంబంధించినంత వరకు నాగార్జున సలహాలను మరియు సూచనలను వారు తీసుకుంటారు. అందులో బాగంగానే బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కోసం హోస్ట్‌ను వెదికే సమయంలో నాగార్జున వారికి నాని పేరును సూచించినట్లుగా తెలుస్తోంది. దాంతో వారు నానితో ఆడిషన్స్‌ చేయడంతో పాటు, నాని స్క్రీన్‌ టెస్ట్‌ చేయడం, ఇంకా పలు రకాలుగా పరీక్షలు చేసుకుని ఫైనల్‌గా ఓకే చేయడం జరిగింది. ప్రస్తుతం నాని, నాగార్జున లు ఒక మల్టీస్టారర్‌లో నటిస్తున్నారు. ఆ సినిమా సమయంలోనే నాగ్‌కు నాని బాగా నచ్చేశాడు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.