Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆఫీసర్ చిత్రం జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొన్నటి వరకు ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయాలని వర్మ ఉరుకు పరుగుల మీద ఏర్పాట్లు చేశాడు. కాని ముంబయి హైకోర్టు ఈ సినిమా విడుదలకు స్టే విధించిన కారణంగా విడుద ఆస్యం అవుతుంది. ముంబయి డిస్ట్రిబ్యూటర్‌కు వర్మ కొంత మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉందట. ఆ మొత్తం చెల్లించే వరకు సినిమాను వాయిదా వేయాలని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో దర్శకుడు వర్మ సినిమాను తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశాడు. వర్మ ఆ డబ్బును చెల్లించేందుకు విశ్వ ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు.
ఆ సమయంలో వర్మకు అండగా నాగార్జున నిల్చున్నాడు. ఈ చిత్రం విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు తాను ముందు నడిచాడు. ఆ డిస్ట్రిబ్యూటర్‌కు ఇవ్వాల్సిన మొత్తంను స్వయంగా నాగార్జున చెల్లించినట్లుగా తెలుస్తోంది. నాగార్జున భారీ మొత్తంలో డబ్బు ఇవ్వడం వల్లే ఇప్పుడు వర్మ సినిమాను జూన్ 1న విడుదల చేయబోతున్నాడు అంటూ సమాచారం అందుతుంది. వర్మ దర్శకత్వంలో గతంలో తాను నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయనే ఉద్దేశ్యంతో నాగార్జున ‘ఆఫీసర్’పై అంచనాలు పెట్టుకున్నాడు. అందుకే ఆఫీసర్ కష్టాల్లో ఉన్నప్పుడు ముందు నిలబడ్డాడు. నాగ్ సాయం లేకపోతే ఆఫీసర్ చిత్రాన్ని వర్మ ఇప్పట్లో విడుదల చేసేవాడు కాదని సినీ వర్గాల వారు అంటున్నారు.