“‘గుంటూరు కారం’ టైటిల్ పై నాగవంశీ అభిప్రాయం”

"Nagavanshi's opinion on the title of 'Guntur Karam'"
"Nagavanshi's opinion on the title of 'Guntur Karam'"

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ కి భారీ ఓపెనింగ్స్ వచ్చినా.. ప్రీమియర్ షోల నుంచి మాత్రం మిక్డ్స్ టాక్ వచ్చింది. అయితే, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ నిర్మాత నాగవంశీ ‘గుంటూరు కారం’ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇంతకీ, నిర్మాత నాగవంశీ ఏం మాట్లాడారు అంటే.. ”గుంటూరు కారం’ మూవీ మాకు బాగా నచ్చింది. కంటెంట్ పరంగా ఆ సినిమా లో ఎలాంటి తప్పూ అనేది లేదు. అలాగే, మూవీ కమర్షియల్‌గా కూడా బాగానే సక్సెస్ అయ్యింది. కానీ, ఒక్క నైజాంలోనే కలెక్షన్స్ పరంగా డ్యామేజ్ అయింది. ఆ సినిమా కి ‘గుంటూరు కారం’ అని టైటిల్ కూడా పెట్డడం ఒక తప్పు అని నేను భావిస్తున్నా. ఫ్యామిలీ సినిమా కి మాస్ టైటిల్ పెట్టడం, పైగా మిడ్ నైట్ 1 AM షో వేయడం కూడా తప్పు అయి ఉండొచ్చు’ అని నిర్మాత నాగవంశీ గారు చెప్పుకొచ్చాడు.