గతకొంత కాలంగా అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే ఈ జంట ఒకటి కానుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తూ ఉన్నాయి . నేడు ఈ వార్తలను నిజం చేస్తూ, ఈ స్టార్ జంట నిశ్చితార్థం చేసుకోవడం ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన మాజీ భార్య సమంతతో విడాకుల తరువాత చైతూ, శోభితా ధూళిపాలతో ప్రేమలో పడ్డారు .
గురువారం రోజు వీరిద్దరు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఉదయం 9.42 గంటలకి ఈ జంట నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య జరిగిందని అక్కినేని నాగార్జున తాజాగా కన్ఫర్మ్ చేశారు. శోభితాను తమ కుటుంబంలోకి ఆయన సాదరంగా నే ఆహ్వానించారు. ఈ జంట కలకాలం ప్రేమతో సంతోషంగా కలిసి ఉండాలని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో కూడా ఒక పోస్ట్ చేశారు.
ఇక చైతూ-శోభితా నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆయన షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
"We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024