ఒక్కటైన నమిత, వీర

namitha-getting-married-to-veera-in-tirupati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సౌత్‌లో పరిచయం అక్కర్లేని ముద్దు, బొద్దుగుమ్మ నమిత. ఈ అమ్మడు ఆ మద్య సీనియన్‌ నటుడు శరత్‌బాబును వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాత వయస్సు వ్యక్తితో ఈమెకు వివాహం ఏంటని అంతా కూడా అవాక్కయ్యారు. కొన్ని రోజులు ఆ వార్తలు తెలుగు మరియు తమిళ మీడియాలో తెగ సందడి చేశాయి. మీడియాలో వస్తున్న వార్తలను నమిత కొట్టి పారేసింది. ఆయనతో నాకు పెళ్లి ఏంటి, ఆయన వస్సు ఏంటీ నా వయస్సు ఏంటీ అంటూ మీడియాను కడిగేసింది. ఆ ప్రచారం ముగిసిందో లేదో వెంటనే నమిత తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. వీర అనే తన స్నేహితుడిని వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది.

namitha

తాజాగా తిరుపతిలో నమిత మరియు వీరలు వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహానికి బంధువులు, సన్నిహితులు తమిళ సినిమా పరిశ్రమ నుండి కొందరు ప్రముఖులు హాజరు అయ్యారు. తమిళ హీరో శరత్‌ కుమార్‌ ఈమె వివాహానికి హాజరు అయ్యి ఆశీర్వదించాడు. పెళ్లి పూర్తి హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కగా సాగింది.

namitha-marriage-pics

సోషల్‌ మీడియాలో ఫొటోలు తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. వీరిద్దరి జంట చాలా బాగుందని, ఇద్దరు కలకాలం సంతోసంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో చెన్నైలో భారీగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నమిత, వీర్‌లకు మీ తరపున మరియు మా తరపున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు.