Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా ‘సొంతం’తో నమిత అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు మరియు తమిళనాట స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ నమిత కాస్త బొద్దుగుమ్మగా మారిపోయింది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గి, తమిళంలోనే ఎక్కువ వచ్చాయి. తెలుగులో సింహా చిత్రంలో నటించి మెప్పించింది. కాని ఆ తర్వాత కూడా ఈమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఆఫర్లు రాకున్నా కూడా కెరీర్‌ను నెట్టుకుంటూ వచ్చిన నమిత ఇటీవలే తన స్నేహితుడిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత నటించేందుకు సిద్దం అయ్యింది.
వివాహం అయ్యి దాదాపుగా సంవత్సరం కాబోతున్న నేపథ్యంలో నమిత మళ్లీ నటన వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బొద్దుగుమ్మ ఈమద్య కాస్త ఎక్సర్సైజ్లు చేసి సన్నబడ్డట్లుగా తెలుస్తోంది. తమిళంలో ఈమెకు ఇప్పటికి కూడా మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్ ఛాన్స్‌లు రాకున్నా కూడా ఈమెకు ఖచ్చితంగా ఒక మోస్తారు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు దక్కే అవకాశం ఉంది. హీరోలకు అక్కగా, అమ్మగా, హీరోయిన్స్‌కు అమ్మగా ఈమె కనిపించే అవకాశాలు రావచ్చు. నమిత సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో ఆమె అభిమానులు తెలుగులో కూడా ఆమె నటించాలని కోరుకుంటున్నారు. మరి దర్శకులు నమితకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.