సూపర్ స్టార్ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లను దక్కించుకున్నాయి. ఈ రెండు చిత్రాలు మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచాయి. ముఖ్యంగా భరత్ అనే నేను చిత్రంతో మహేష్‌బాబు స్థాయి మరింతగా పెరిగింది. వంద కోట్ల షేర్‌ను దక్కించుకుని రికార్డులు బ్రేక్ చేసిన మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక తాజాగా మహేష్‌బాబు, కొరటాల శివల కాంబోలో మూడవ సినిమా గురించిన చర్చలు జరుగుతున్నాయి. వీరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా భరత్ అనే నేను కు సీక్వెల్ అంటూ ప్రచారం జరుగుతుంది.
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. నమ్రతతో ఆయన మాట్లాడిన సమయంలో భరత్ అనే నేను చిత్రానికి సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారట. పార్లమెంటులో కూడా భరత్ అనే నేను చిత్రం గురించిన చర్చ జరిగిన నేపథ్యంలో ఆ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకుల చేరువగా తీసుకు వెళ్లేందుకు సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా నమ్రత ఆయనతో చెప్పుకొచ్చిందట. కొరటాల శివ ఇప్పటికే తన శిష్య బృందంతో సీక్వెల్‌కు కథను సిద్దం చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత మహేష్‌తో భరత్ అనే నేను మూవీ సీక్వెల్ ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. 2020 తర్వాత మరోసారి భరత్ సీఎంగా ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో చూడాలి.