రికార్డుల దిశగా ఎన్టీఆర్ సాంగ్…!

Nandamuri Balakrishna Kathaa Naayaka Song From Ntr Biopic Movie

ఎన్టీఆర్ బయోపిక్ ఆలోచన మొదలు అయినప్పటి నుంచే ఆ సినిమా చుట్టూ ప్రేక్షకుల దృష్టి మళ్లింది. తేజ నుంచి క్రిష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాక అంచనాలు కూడా పెరిగాయి. ఎప్పుడైతే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యిందో అప్పటి నుంచి అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఎన్టీఆర్ ని బాలయ్యలో చూసుకుంటున్న తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. వరసగా ఈ సినిమాలో ముఖ్య పాత్రల గెట్ అప్స్ వస్తూనే వున్నాయి.

ntr-bio-pic

ఎన్టీఆర్ బయోపిక్ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. ఇంతలో కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన కథానాయక పూర్తి నిడివి పాట ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. పాట విడుదల అయిన 24 గంటల్లో పెద్ద సంఖ్యలో నెటిజన్లు దాన్ని చూసారు , విన్నారు. ఖైలాష్ ఖేర్ పాడిన కథానాయక పాటలో సంస్కృత పదాలు బాగా వాడారు. అయితే భావ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ కీరవాణి చేసిన ట్యూన్ తో రసహృదయులు ఈ పాటని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.