ఎన్టీఆర్‌లో మోక్షజ్ఞ.. మళ్లీ అనుమానాలు…!

Mokshagna To Play Balakrishna Character

నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’పై సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. బాలకృష్ణ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న విషయం తెల్సిందే. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు క్రిష్‌ చెబుతూ వస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హేమా హేమీలు నటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞని కూడా ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం చేయాలని దర్శకుడు క్రిష్‌ భావించాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా నిర్మాత సాయి కొర్రపాటి చెప్పుకొచ్చాడు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌లో మోక్షజ్ఞ ఉండక పోవచ్చు.

moshazna

మోక్షజ్ఞ ప్రస్తుతం కాస్త ఎక్కువ లావుగా ఉన్నాడు. ఎన్టీఆర్‌ పాత్ర కోసం మోక్షజ్ఞ దాదాపుగా 20 కేజీల బరువు తగ్గాల్సి ఉంది. అందుకే ఆరోగ్యంగా తగ్గేందుకు మోక్షజ్ఞను సింగపూర్‌ పంపించినట్లుగా నందమూరి ఫ్యామిలీ వర్గాల వారు చెప్పుకొచ్చారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సింగపూర్‌ నుండి తిరిగి వచ్చాడని, ఆయన ఈ చిత్రంలో కనిపించబోవడం లేదని, ఏమాత్రం బరువు తగ్గకుండా అలాగే ఉన్న మోక్షజ్ఞను ఈ చిత్రంలో చూపించేందుకు బాలయ్య ఆసక్తి చూపడం లేదు అంటూ సమాచారం అందుతుంది. బాలయ్య నిర్ణయం మేరకు క్రిష్‌ ఆ పాత్రకు మరో నటుడిని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ తనయుడు ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తే సినిమా స్థాయి పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.