రాశిఖన్నాతో రౌడీ రొమాన్స్‌

vijay devarakonda to romance rashi khanna

విజయ్‌దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ చిత్రం తర్వాత వెంటనే ‘ట్యాక్సీవాలా’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్దం అవ్వగా, డియర్‌ కామ్రెడ్‌ చిత్రం ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. డియర్‌ కామ్రెడ్‌ చిత్రంలో రష్మిక మందనతో మరోసారి రొమాన్స్‌ చేయబోతున్న విజయ్‌ దేవరకొండ తాజాగా చేయబోతున్న మరో సినిమాలోరాశిఖన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కేఎస్‌ రామారావు నిర్మాణంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది.

vijay devarakonda And rashi khanna

విజయ్‌ దేవరకొండతో మూవీ అంటూ ప్రస్తుతం సినీ వర్గాల వారు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించబోతున్న మూవీలో హీరోయిన్‌గా రాశిఖన్నా హీరోయిన్‌గా ఎంపిక అయినట్లుగా తెలుస్తోంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ‘తొలిప్రేమ’ చిత్రంతో విజయాన్ని దక్కించుకుంది. అయితే ఈమె తాజాగా నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఈమెకు కష్టాలే అని అనుకున్నారు. కాని ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రాశిఖన్నాకు విజయ్‌ దేవరకొండతో నటించే ఛాన్స్‌ దక్కింది. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల్లో హీరోయిన్స్‌ పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. అందుకే ఈచిత్రంలో రాశిఖన్నాకు నటిగా ప్రూవ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండకు రాశిఖన్నా ఎంత మేరకు సూట్‌ అవుతుందో చూడాలి.

vijay-devarakonda