విజయ్‌ గీతను వదలడం లేదుగా..!

vijay-and-rashmikas-next-movie-dear-comrade

విజయ్‌ దేవరకొండ ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయ్యాడు. పెళ్లి చూపులు చిత్రంతో ఒక మోస్తరు గుర్తింపును దక్కించుకున్న ఈ యువ హీరో అర్జున రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. అర్జున్‌ రెడ్డి తర్వాత విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ప్రతి ఒక్క సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకేలా వస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఈయన మంచి కథ మరియు దర్శకుడిని ఎంపిక చేసుకుని మరీ చిత్రాలు చేస్తున్నాడు. మంచి స్టోరీ లైన్‌తో విజయ్‌ తాజాగా రెండు చిత్రాలు చేశాడు. వాటిలో మొదటిగా గీత గోవిందం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఆ వెంటనే ట్యాక్సీవాలా చిత్రం కూడా విడుదలకు సిద్దం కాబోతుంది. ఈ రెండు చిత్రాలు ఇంకా విడుదల కాకుండానే అప్పుడే మరో సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంను విజయ్‌ మొదలు పెట్టాడు.

vijay devara konda and rashmika

గీత గోవిందం’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే విడుదలైన పాటలు మరియు టీజర్‌, ట్రైలర్‌కు అనూహ్యంగా భారీ రెస్పాన్స్‌ దక్కింది. దాంతో పాటు వీరిద్దరి జోడీకి కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ ఉందని, ప్రేక్షకులు వీరిద్దరి జంటను కోరుకుంటున్నారని గ్రహించిన దర్శకుడు డియర్‌ కామ్రెడ్‌ చిత్రంలో కూడా రష్మిక మందనను ఎంపిక చేయడం జరిగింది. ఛలో చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈమె ప్రస్తుతం ‘దేవదాసు’ చిత్రంలో నానికి జోడీగా కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. మొత్తానికి ఈ అమ్మడు చేస్తున్న చిత్రా జాబితా పెరిగి పోతుంది. విజయ్‌ దేవరకొండకు జోడీగా ఈమె బాగా సూట్‌ అయిన కారణంగా ఇంకా ముందు ముందు కూడా వీరి కాంబోలో మూవీలను చూసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

vijay devarakonda And Rashmika Next Movie update