మహేష్‌25 మూవీ టైటిల్‌ క్లారిటీ

mahesh babu clarity about irish movie

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌కు రంగం సిద్దం అయ్యింది. ఈనెల 9న మహేష్‌బాబు బర్త్‌డే సందర్బంగా ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ చిత్రం టైటిల్‌ ఏమై ఉంటుందా అని గత కొన్నాళ్లుగా ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా మహేష్‌బాబు మూవీ టైటిల్‌ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్‌లుక్‌ విడుదలకు ముందే దర్శకుడు వంశీ పైడిపల్లి టైటిల్‌కు సంబంధించిన ఒక్కో లెటర్‌ చొప్పున రివీల్‌ చేస్తూ వచ్చాడు. మొదట ఆర్‌, తర్వాత ఐ, ఎస్‌, హెచ్‌, ఐ లెటర్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నేపథ్యంలో ఈ చిత్రానికి ‘రిషి’ అనే టైటిల్‌ ఖరారు అయ్యిందని అంతా భావిస్తున్నారు.

mahesh babu

మహేష్‌బాబు 25వ చిత్రం టైటిల్‌ రిషి అయ్యి ఉంటుందని కొందరు భావిస్తుండగా, మరి కొందరు మాత్రం ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర పేరు రిషి అని, టైటిల్‌ వేరే ఉండి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి టైటిల్‌ విషయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి అందరిలో కూడా చర్చకు తెర లేపాడు. మరో రెండు రోజుల్లో మహేష్‌బాబు మూవీ టైటిల్‌పై క్లారిటీ రావడంతో పాటు, మహేష్‌ ఫస్ట్‌లుక్‌ కూడా రివీల్‌ అయ్యే అవకాశం ఉంది. మహేష్‌బాబు ఈ చిత్రంలో మొదటి సారి గడ్డంతో కనిపించబోతున్నాడు. గడ్డం లుక్‌తో మహేష్‌బాబు ఎలా ఉంటాడో అంటూ అంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గడ్డం లుక్‌తో కొన్ని ఫొటోలు వచ్చాయి. అయితే అధికారిక లుక్‌ మాత్రం ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్‌బాబుకు జోడీగా ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్య పాత్రలో అల్లరి నరేష్‌ నటిస్తుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.