నందమూరి హరికృష్ణ దుర్మరణం…!

 

బ్రేకింగ్ న్యూస్ అందుతోంది నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నాయకుడు సినీ నటుడు నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. నెల్లూరు నుండి హైదరాబాద్ వస్తున్న క్రమంలో అన్నేపర్తి సమీపంలో ఆయన ప్రయాణిస్తోన్న వాహనం బోల్తాపడింది. ఎదురుగా వాహనం రావడంతో దానిని తప్పించే క్రమంలోఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను నార్కెట్‌ పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు.

nandhamuri-hari-krishna

వాహనం స్టీరింగ్ బలంగా ఆయన ఛాతిని ఢీ కొట్టింది, అలాగే అఆయన తలకు కూడా బలమైన గాయాలు అవడంతో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు ప్రకటించారు. ప్రయాణం జరిగిన సమయంలో హరికృష్ణ స్వయంగా వాహనం నడుపుతున్నట్టు తెలుస్తోంది. వాహనంలో ఉన్న మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ మంత్రి నారా లోకేష్ ఇతర కుటుంబ సభ్యులు వెంటనే నార్కెట్‌పల్లికి బయల్దేరి వెళ్లారు. ఈ ఘటన తెలియడంతో నందమూరి అభిమానులు విషాదంలో మునిపోయారు.

NANDHAMURI