టీఆర్ఎస్ లోకి సుహాసిని…క్లారిటీ ఇచ్చారుగా !

Nandamuri Suhasini Clarity On TRS Joining

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున కూకట్ పల్లి నుంచి బరిలో నిలిచి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆమె గెలుపుకోసం నందమూరి,నారా కుటుంబాలు రంగంలోకి దిగినప్పటికీ ఆమె పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో తెలుగుదేం పార్టీని ఏపీలో ఇబ్బందుల్లో పెడతాం, ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.. అన్న టీఆర్ఎస్ ఆంధ్రకి సపోర్ట్ చేయడానికి రెడీ అయిన కేసీఆర్ చంద్రబాబే టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి మ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం ఈ అంశం తెరాస శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

అలాగే, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒకింత షాక్‍‌కు గురై… ఇది నిజమా కాదా అనేదానిపై ఆరా తీస్తున్నర్నై వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలను ఖండిస్తూ నేను తాజాగా, సుహాసిని మాట్లాడుతూ తమ కుటుంబం టీడీపీతోనే ఉంటుందని చెప్పడంతో ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది. ఇక అక్కడ ఓటమి పాలైతేనేం పార్టీ కోసం పని చేస్తా అంటున్నారు సుహాసిని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సంక్రాంతి వేడుకల కోసం గుంటూరు జిల్లా తెనాలి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి తమ కుటుంబం పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగిన సుహాసిని ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడినా తాను కూకట్‌పల్లి ప్రజలకు అందుబాటులోనే ఉంటానని, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మరోవైపు, సుహాసిని టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, కేసీఆర్ చెబుతున్న ‘రిటర్న్ గిఫ్ట్’ అదేనన్న వార్తలు కూడా వినిపించాయి.