Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌కు సెకండ్ నైజాంలా ఓవర్సీస్ మారిపోయింది. ఒక తెలుగు సినిమా నైజాం మరియు ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్‌ను రాబడితే అది సూపర్ హిట్ అయినట్లుగా భావించవచ్చు. స్టార్ హీరోలు అంతా కూడా ఓవర్సీస్‌పై ఎక్కువ దృష్టిని పెడుతున్నారు. ఓవర్సీస్లో ఒక సినిమా మిలియన్ డాలర్లను సాధించింది అంటే ఆ హీరోను స్టార్ హీరోగా పేర్కొనవచ్చు. కాని నాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మిలియన్ డాలర్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్‌బాబు అయిదు మిలియన్ డాలర్ల సినిమాలను కలిగి ఉన్నాడు.
మహేష్‌బాబు తర్వాత స్థానంలో నిన్నటి వరకు ఎన్టీఆర్ ఉండేవాడు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు నాలుగు మిలియన్ డాలర్ల సినిమాలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన నాని చేరాడు. నాని నటించిన ‘ఈగ’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘నిన్నుకోరి’ చిత్రాలు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్లను వసూళ్లు చేశాయి. ఇంత భారీ కలెక్షన్స్‌ను మెగా హీరోలు చరణ్, బన్నీ చివరకు పవన్ కూడా సాధించలేక పోయాడు. ఈ అరుదైన రికార్డు సాధించినందుకు గాను నాని ఖ్యాతి మరింత పెరిగి పోయింది. త్వరలో నాని చేయబోతున్న రెండు సినిమాలు కూడా ఖచ్చితంగా ఓవర్సీస్లో మరోసారి సత్తా చాటుతాయని ఆ విధంగా మహేష్‌బాబును కూడా చేరే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.
మరిన్ని వార్తలు