బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ మూవీలో సుమ ప్రధాన పాత్రలో నటిస్తుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలోని తొలి సాంగ్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ‘తిప్పగలనా.. చూపులు నీ నుంచే’ అంటూ సాగే ఈ పాటకు రామాంజనేయులు లిరిక్స్ అందించగా, . పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించాడు.