నాని టైం నడుస్తోంది

Nani New Movie Ninnu Koti Will Be Another Block Buster

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Nani New Movie Ninnu Koti Will Be Another Block Buster

సహజ నటుడిగా పేరు తెచ్చుకున్న నాని వరుసగా సక్సెస్‌లు అందుకుంటూ వస్తున్నాడు. ఇటీవలే ‘నేను లోకల్‌’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్న యువ హీరో నాని తాజాగా మరో చిత్రంతో రెడీ అయ్యాడు. ‘నిన్ను కోరి’ అనే విభిన్నమైన టైటిల్‌తో నివేదా థామస్‌ హీరోయిన్‌గా నటించిన నాని కొత్త సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌ మరియు నేడు విడుదలైన ట్రైలర్‌తో సినిమా మరోసారి నానికి సక్సెస్‌ను తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

ఒక విభిన్న ప్రేమ కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. నాని మరోసారి అద్బుతమైన నటనతో మరియు ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తో దుమ్ము రేపడం ఖాయం అని సినీ పండితులు అంటున్నారు. ప్రస్తుతం నాని ‘నిన్నుకోరి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకు పోతున్న ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకోవడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నాని టైం నడుస్తుందని, ఏం చేసినా కూడా సక్సెస్‌ అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. నాని కెరీర్‌లో ‘నేను లోకల్‌’ చిత్రం బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా నిలిచి, భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడు ‘నిన్నకోరి’ చిత్రం ఆ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు :

ఇది మరీ ఓవర్‌ గురు

మొదటి నుండి అనుకుంటున్నదే..!