శిరీష మరణంతో టీ కాంగ్రెస్ కి లంకె వేసారా?

police arrested to sravan on Beautician sirisha and SI prabhakar reddy death

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బ్యూటీషియన్ శిరీష మరణం గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు. అటు si ప్రభాకర్ రెడ్డి కుటుంబం కూడా ఇదంతా ఓ కుట్రలో భాగం అంటోంది. అయితే ఈ వివాదానికి కేంద్రబిందువు రాజీవ్ అని అర్ధం అవుతున్నప్పటికీ శ్రావణ్ ని A 1 గా పోలీసులు నిర్దారించడం మీద సందేహాలు తలెత్తుతున్నాయి. శ్రావణ్ కుట్రపూరిత వ్యవహారం వల్లే ఈ దారుణాలకు కారణమని పోలీసులు అనడం వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు కొందరు అంటున్నారు. కేసు సున్నితత్వం వల్ల ఇప్పుడు బయటపడకపోయినా రాబోయే రోజుల్లో ఇది కాంగ్రెస్ మెడకి చుట్టుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా ఓ వాదన వినిపిస్తోంది.

కొందరు వ్యక్తుల మధ్య వ్యవహారం లో కాంగ్రెస్ నేతలు కంగారుపడేందుకు కారణం లేకపోలేదు. ఈ కేసులో A 1 గా వున్న శ్రవణ్ కాంగ్రెస్ అనుబంధ యువ విభాగం లో చురుగ్గా పనిచేసేవాడు. పైగా ఇతను ఆ టైం లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, వీ హెచ్ తదితరులతో కలిసి పనిచేసినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన ఫోటోలు దిగినట్టు, అవి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నట్టు సమాచారం. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం శ్రవణ్ కి వ్యభిచారం లాంటి వాటితో సంబంధం వుంది. ఇప్పుడు శ్రవణ్ తో కాంగ్రెస్ నేతలకు సంబంధం ఉందని కూడా తెలుస్తోంది. ఈ తీగ ఎక్కడి దాకా వెళుతుందో తెలియక కాంగ్రెస్ నాయకులు టెన్షన్ పడుతున్నారట.

నారాయణ ని చూసి నేర్చుకోండి.

కాంగ్రెస్ ఓయూ ప్లాన్ కు కేసీఆర్ కౌంటర్